logo

మంత్రివర్గ ఉపసంఘంవేయడాన్ని ఆహ్వానిస్తున్నాం

ఫీజుల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హైదరాబాద్‌ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం ప్రకటించింది. దశాబ్ద కాలంగా సంఘం చేస్తున్న పోరాటానికి

Published : 18 Jan 2022 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫీజుల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం వేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హైదరాబాద్‌ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం ప్రకటించింది. దశాబ్ద కాలంగా సంఘం చేస్తున్న పోరాటానికి స్పందించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపింది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం వివిధ సందర్భాల్లో ఇందిరాపార్కు వద్ద ధర్నాలు, మానవహారాలు చేశామని, చివరికి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని సంఘం సంయుక్త కార్యదర్శి వెంకట సాయినాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం ఆరు వారాల్లో స్పష్టత ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని