logo

నీటి నిలువకు ఆనకట్టల నిర్మాణం

కాగ్నానది పై రూ.48కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 6 ఆనకట్టలను వచ్చే జూన్‌లోగా పూర్తి చేసి వరద నీటిని నిలువరించాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు సూచించారు.

Published : 19 Jan 2022 02:43 IST


ముస్లిం సంక్షేమ సంఘంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు: కాగ్నానది పై రూ.48కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 6 ఆనకట్టలను వచ్చే జూన్‌లోగా పూర్తి చేసి వరద నీటిని నిలువరించాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు సూచించారు. ఈమేరకు ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆనకట్టల నిర్మాణం విషయమై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. చిట్టిగణాపూరు, ఎల్మకన్నె గ్రామాల సమీపం కాగ్నానదిపై ఇంకా ఆనకట్టల నిర్మాణం ప్రారంభం కాని విషయమై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీరు సుందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

* తాండూరు నియోజకవర్గంలోని 258 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం ఈడీసీ అధికారులతో విద్యాపరమైన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.  

మైనార్టీల అభివృద్ధికి కృషి  
తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ముస్లిం సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. దీన్లో పాల్గొని ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బాబర్‌, ప్రతినిధులు అహ్మద్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు నయీం, ఎంఐఎం అధ్యక్షుడు హాదీ, పురపాలక కౌన్సిలరు ముక్తార్‌, నాయకులు జుబేర్‌ తదితరులు పాల్గొన్నారు.

* కరోనా వైరస్‌ను అరికట్టడానికి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. పోలీసు, రెవెన్యూ, పురపాలక అధికారులతో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌ కుమార్‌, డీఎస్పీ లక్ష్మీనారాయణ, గ్రామీణ సీఐ జలంధర్‌రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, వ్యవసాయ విపణి అధ్యక్షుడు విఠల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని