logo

పండ్ల తోటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు

నేల అనుకూలతను బట్టి విపణిలో డిమాండున్న పండ్ల తోటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి రైతులకు సూచించారు. మంగళవారం మోమిన్‌పేట రైతు వేదికలో ఉద్యాన,

Published : 19 Jan 2022 02:43 IST


మాట్లాడుతున్న జిల్లా అధికారి చక్రపాణి

మోమిన్‌పేట: నేల అనుకూలతను బట్టి విపణిలో డిమాండున్న పండ్ల తోటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి రైతులకు సూచించారు. మంగళవారం మోమిన్‌పేట రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడులతో పండ్ల తోటల సాగు చేయవచ్చన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీ, పుచ్చ, తర్బూజ, బొప్పాయి సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.  కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, మోమిన్‌పేట గ్రామ సర్పంచి శ్రీనివాస్‌రెడ్డి, మండల ఉద్యానశాఖ అధికారి గఫర్‌, ఏవో  జయశంకర్‌, శాస్త్రవేత్తలు నాగరాజు, రాజదురై తదితరులు పాల్గొన్నారు.

వివరిస్తున్న శాస్త్రవేత నాగరాజు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని