logo

భాగ్యనగర చిత్ర వార్తలు

సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి వచ్చేయడం, కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లిన వారి వాహనాలతో రహదారులు రద్దీతో నిండిపోయాయి. మంగళవారం సాయంత్రం నానక్‌రాంగూడ గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మార్గంలో

Published : 19 Jan 2022 02:53 IST

సెలవు లేదిక.. రద్దీ తప్పదిక

సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వెళ్లిన నగరవాసులు తిరిగి వచ్చేయడం, కార్యాలయాలకు పనుల నిమిత్తం వెళ్లిన వారి వాహనాలతో రహదారులు రద్దీతో నిండిపోయాయి. మంగళవారం సాయంత్రం నానక్‌రాంగూడ గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ మార్గంలో కిక్కిరిసిన వాహనాలు ఇవి.


కొవిడ్‌ విజృంభణ, మరోపక్క వాతావరణ మార్పులతో స్వల్ప లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం ముషీరాబాద్‌లోని పీహెచ్‌సీ వద్ద గంటల తరబడి వేచిచూశారు.


ఆహా..రం ఆకట్టుకునేలా..

చూడగానే ఆటోలు, లారీలకు రిపేర్లు చేసే మెకానిక్‌ షాపు అనుకునేరు? ఇదొక హోటల్‌ ముఖద్వారం. నాగోలు మెట్రో స్టేషన్‌ సమీపంలో ఓ హోటల్‌ యజమాని వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఆ ప్రాంతాన్ని ఇలా ఆటో, లారీ బాడీలతో అందంగా అలంకరించారు.


ఊరికే ఉండలేక.. ఊరికింత సేవ

రెండు చేతుల్లేవ్‌.. కాళ్లే ఆమెకు ఆధారం. పైగా వృద్దురాలు. ఊరికే అడుక్కొని జీవించే అవకాశం ఉంది. కానీ కాళ్లనే చేతులుగా మార్చుకొని చీపురుతో రహదారిని శుభ్రం చేస్తూ నాంపల్లి వద్ద కనిపించింది.


ఆదమరవొద్దు.. ఆరిపోవద్దు..

డుగడుగునా వాహనాలతో రద్దీగా ఉండే నగర రహదారులపై ఎంత ప్రమాదం? నగరంలోకి ఉల్లిపాయల లోడ్‌ తీసుకువస్తున్న గూడ్సు ఆటోపై ఓ వ్యక్తి ఆదమరచి నిద్రిస్తున్న దృశ్యం లక్డాకాపూల్‌లో కనిపించింది.


అందంగా కొలను.. చూడలేము కలలోనూ..

ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతాలంటే ఎంతో అందంగా ఉంటాయని భావిస్తాం. కానీ ఇక్కడికి ప్రవేశించక ముందే ఖైరతాబాద్‌ వంతెన వద్ద ఉన్న పార్కు కొలనులో నీటి దుర్వాసనకు ఠారెత్తిపోతాం. ఆ నీరంతా పాకురు పట్టి పచ్చగా మారి సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు.


వ్యవసాయ క్షేత్రంలో నిఘా నేత్రం

యత్‌నగర్‌ మండలం కుంట్లూరులో కనపించిన దృశ్యమిది. రహదారికి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో చంద్రారెడ్డి అనే రైతు ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలు అధికం కావడంతో  తన అరెకరాల పొలం చుట్టూ పది సీసీ కెమెరాలు అమర్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని