logo

పంజాగుట్టశ్మశాన వాటికపై.. రెండో వంతెన పూర్తి

పంజాగుట్ట శ్మశానవాటికపై రెండో పైవంతెన నిర్మాణం పూర్తయింది. ఇది ప్రారంభిస్తే నగరాన్ని హైటెక్‌సిటీతో అనుసంధానం చేసే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తప్పినట్లవుతుంది. సికింద్రాబాద్‌, ఉప్పల్‌, బేగంపేట్‌ ఇతర ప్రాంతాల నుంచి

Published : 19 Jan 2022 03:59 IST

త్వరలో ప్రారంభించనున్న ప్రజా ప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్‌

పంజాగుట్ట శ్మశానవాటికపై రెండో పైవంతెన నిర్మాణం పూర్తయింది. ఇది ప్రారంభిస్తే నగరాన్ని హైటెక్‌సిటీతో అనుసంధానం చేసే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తప్పినట్లవుతుంది. సికింద్రాబాద్‌, ఉప్పల్‌, బేగంపేట్‌ ఇతర ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది మంది పంజాగుట్ట నాగార్జున కూడలి మీదుగా బంజారాహిల్స్‌ రోడ్డు 3, కేబీఆర్‌పార్కు, జూబ్లీచెక్‌పోస్టు మీదుగా మాదాపూర్‌, మైండ్‌స్పేస్‌ కూడలి, ఓఆర్‌ఆర్‌ వైపు రాకపోకలు సాగిస్తుంటారు. బొందలగడ్డ వద్ద రోడ్డు మార్గం ఇరుగ్గా ఉండటంతో నాగార్జున కూడలి వద్ద ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ సమస్య పరిష్కారించేందుకు జీహెచ్‌ఎంసీ మూడేళ్ల క్రితం సమాధుల పైనుంచి చట్నీస్‌ హోటల్‌ వైపు ఉక్కు వంతెన నిర్మించింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెం.3 నుంచి నాగార్జున కూడలివైపు వెళ్లే వాహనాలకు ఇది ఉపయోగకరం. నిర్మాణాన్ని ప్రారంభించాక.. ఇంజినీర్లు ఏడాదిన్నర క్రితం ప్రధాన శ్మశానవాటికవైపు విస్తరణ పనులు మొదలుపెట్టారు. రోడ్డు నుంచి ఆరు మీటర్ల మేర లోపలికి వెళ్లి, సమాధుల మీదుగా ఉక్కు దిమ్మెలపై 140 మీటర్ల పొడవున వంతెన నిర్మించారు. దాంతో రెండు లైన్లుగా ఉన్న రోడ్డు ఇప్పుడు నాలుగు లైన్లుగా మారింది. విస్తరించిన రోడ్డు సాయంతో నాగార్జున కూడలి నుంచి కేబీఆర్‌పార్కు కూడలి వైపు వెళ్లే వాహనాలు ఇక సాఫీగా సాగిపోనున్నాయి. అలాగే.. శ్మశానం లోపలికి చేరుకునేందుకు 135 మీటర్ల పొడవున వంతెన నిర్మించింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1 నుంచి శ్మశానంలోకి చేరుకునే రోడ్డు అభివృద్ధి కోసం రూ.6కోట్లకు భూసేకరణకు వెచ్చించామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మొత్తం రూ.17కోట్లతో పనులు చేపట్టామని వెల్లడించింది. వంతెనను త్వరలోనే మంత్రి కేటీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని