logo

కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత

అనధికార భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌, హెచ్‌ఎండీఏ యంత్రాంగం దూకుడు పెంచింది. సోమవారం 600 గజాల మించిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన అధికారులు మంగళవారం

Published : 19 Jan 2022 03:59 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అనధికార భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌, హెచ్‌ఎండీఏ యంత్రాంగం దూకుడు పెంచింది. సోమవారం 600 గజాల మించిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభించిన అధికారులు మంగళవారం మరో 13 అక్రమ భవనాలను కూల్చివేశారు. రెండు రోజుల్లో మొత్తం 23 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు, దుండిగల్‌లో మూడు, బడంగ్‌పేట్‌లో మూడు, పోచారంలో రెండు, బోడుప్పల్‌లో ఒక నిర్మాణాన్ని కూల్చివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని