logo

మూడు రోజులపాటు38 ఎంఎంటీఎస్‌ల రద్దు

ఎంఎంటీఎస్‌ సేవలు గాడిన పడడం లేదు. ఏ చిన్న కారణమున్నా వాటిని ఆపేసి పనులు నిర్వహిస్తున్నారు. తాజాగా 19, 20, 21 తేదీల్లో మొత్తం 38 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు

Published : 19 Jan 2022 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ సేవలు గాడిన పడడం లేదు. ఏ చిన్న కారణమున్నా వాటిని ఆపేసి పనులు నిర్వహిస్తున్నారు. తాజాగా 19, 20, 21 తేదీల్లో మొత్తం 38 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ద.మ. రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.

* లింగంపల్లి - హైదరాబాద్‌ మధ్య 9 ఎంఎంటీఎస్‌లు రద్దు చేశారు. హైదరాబాద్‌ - లింగంపల్లి మధ్య మరో 9 ఎంఎంటీఎస్‌లు రద్దు అయ్యాయి.

* ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య 9, లింగంపల్లి - ఫలక్‌నుమా మధ్య మరో 9 ఎంఎంటీఎస్‌లు రద్దు చేశారు.

* సికింద్రాబాద్‌ - లింగంపల్లి మధ్య మరో 2 ఎంఎంటీఎస్‌లను రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని