logo

ఇలా బిల్లు.. అలా చెల్లింపు

ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఎక్కువగా ఆయా సంస్థల ఉద్యోగులు నివసిస్తుంటారు. కరెంట్‌ బిల్లు చేతికి ఇవ్వగానే వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. కొత్త బిల్లు చూపకపోవడంతో వెంటనే బిల్లు కట్టలేకపోయేవారు. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. విద్యుత్తు సంస్థ సైతం తొలిరోజే ....

Published : 19 Jan 2022 04:18 IST

స్మార్ట్‌ విద్యుత్తు బిల్లింగ్‌ ప్రయోగం విజయవంతం
ఈనాడు, హైదరాబాద్‌

టీ కారిడార్‌ చుట్టుపక్కల ఎక్కువగా ఆయా సంస్థల ఉద్యోగులు నివసిస్తుంటారు. కరెంట్‌ బిల్లు చేతికి ఇవ్వగానే వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. కొత్త బిల్లు చూపకపోవడంతో వెంటనే బిల్లు కట్టలేకపోయేవారు. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. విద్యుత్తు సంస్థ సైతం తొలిరోజే వచ్చే రెవెన్యూను కోల్పోయేది. సమస్యను గుర్తించిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పాత స్పాట్‌ బిల్లింగ్‌ యంత్రాల స్థానంలో స్మార్ట్‌ బిల్లింగ్‌ యంత్రాలు (ఇంటిగ్రేటెడ్‌ స్పాట్‌ బిల్లింగ్‌ మెషిన్‌-ఐఎస్‌బీఎం)లను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకంగా చిప్‌ ఉంటుంది. బిల్లు తీయడమే ఆలస్యం జీపీఆర్‌ఎస్‌ సాయంతో వెంటనే రికార్డుల్లో కొత్త బిల్లు చూపిస్తుంది. గత ఏడాది ప్యారడైజ్‌ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. క్రమంగా బంజారాహిల్స్‌, గ్రీన్‌ల్యాండ్స్‌కు విస్తరించారు. ప్రస్తుతం మిగిలిన డివిజన్లలోనూ  ఐఎస్‌బీఏంతోనే బిల్లులు తీసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.


రెండు నెలల్లో..

గ్రేటర్‌లో ప్రతినెలా రెండు మూడు తేదీల్లో బిల్లింగ్‌ మొదలై రెండువారాలపాటు కొనసాగుతుంది. ప్రస్తుతమున్న విద్యుత్తు మీటర్లన్నీ ఐఆర్‌ఫోర్ట్‌వే. బిల్లింగ్‌ మిషన్లను మీటర్ల సమీపంలోకి తీసుకెళ్లి చూపించగానే ఆటోమెటిక్‌గా బిల్లు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకరోజు బిల్లులన్నీ తీశాక సదరు మీటర్‌ రీడర్‌ను సాయంత్రం కార్యాలయానికి వెళ్లి అనుసంధానిస్తేనే ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. కాబట్టి స్పాట్‌లో బిల్లుల చెల్లింపులు ఉండేవి కావు. ‘జీపీఆర్‌ఎస్‌ సాయంతో ఇంటిగ్రేటెడ్‌ స్పాట్‌ బిల్లింగ్‌తో ఈ సమస్య తీరిపోనుంది. మొదట కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాం. మంచి ఫలితాలు వచ్చాయి. రెండునెలల్లో నగరం మొత్తం ఈ పక్రియ పూర్తవుతుంది. అప్పుడు సిటీలోని ఏ వినియోగదారైనా బిల్లు వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు’ అని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌ ‘ఈనాడు’కు తెలిపారు.


బిల్‌ రీడర్‌ మీ ఇంటి ప్రాంగణంలో ఉండగానే మొబైల్‌కు బిల్లు సందేశం వస్తుంది కాబట్టి.. ఒకవేళ అధిక బిల్లు వస్తే వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. తప్పుగా ఉంటే వెంటనే కొత్త బిల్లు జారీ చేసే అవకాశం ఐఎస్‌బీఎంతో ఉందని డీఈ ఒకరు తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో (అక్టోబరు 1, 2021 నాటికి)

మొత్తం వినియోగదారులు   53.52 లక్షలు

గృహ     ।।               43.93 లక్షలు

వాణిజ్య    ।।              7,22,000

ఎల్‌టీ పరిశ్రమలు          35,110

హెచ్‌టీ పరిశ్రమలు         7,490

ఇతర                     1,94,000

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని