logo

జాగ్రత్తలతోనే కరోనా కట్టడి: సునీతారెడ్డి

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో విద్యార్థులను మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు సిద్ధం చేయాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు పట్నం సునీతారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాల్లో వివిధ

Published : 20 Jan 2022 01:46 IST


సమావేశంలో ప్రసంగిస్తున్న జడ్పీ అధ్యక్షురాలు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో విద్యార్థులను మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు సిద్ధం చేయాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు పట్నం సునీతారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాల్లో వివిధ శాఖల పనితీరు, ప్రజల సమస్యలు, అభివృద్ధిపై అధికారులు, కమిటీ సభ్యులతో ఆమె సమీక్షించారు. కొవిడ్‌ కేసులు అధికమవుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి కట్టడి చేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు పెంచాలన్నారు. వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచి మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ నిధులతో గ్రామాల్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 1,766 పనులు మంజూరీ కాగా, 1,200 పనులు పూర్తయ్యాయని, మిగతావి అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు. ధరణి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ దృష్టికి మరోమారు తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. సమీకృత వ్యవసాయ విధానంలో భాగంగా వరి వద్దన్నా సాగు చేస్తున్నారని, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని అవగాహన కల్పించాలని వ్యవసాయ స్థాయీ సంఘం అధ్యక్షుడు, జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తెలిపారు. అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, జడ్పీటీసీలు సుజాతారెడ్డి, అరుణదేషు చౌహాన్‌, నాగిరెడ్డి, సంధ్యారాణి, సంతోష, మహిపాల్‌, మధుకర్‌, రామ్‌దాస్‌నాయక్‌, హరిప్రియ, మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు