logo

చిత్ర వార్తలు

ఆహ్లాద భరిత వాతావరణం మధ్య ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నారు. మెరుగుదిద్దే పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు, హంసద్వారం, దివ్యదేశ దర్శనం, భద్రవీధి,

Published : 20 Jan 2022 04:22 IST

పూలతో స్వాగతం.. రామానుజాచార్యుని దర్శనం 

ఆహ్లాద భరిత వాతావరణం మధ్య ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నారు. మెరుగుదిద్దే పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు, హంసద్వారం, దివ్యదేశ దర్శనం, భద్రవీధి, ఉజ్జీవన సోపానం గుండా రామానుజాచార్యుల విగ్రహ దర్శనం కానుంది. విగ్రహం ముందు ఉన్న 45 ఎకరాల్లో విశాల ప్రాంతంలో సందర్శకులను ఆకట్టుకొనేలా పూలు, అలంకరణ మొక్కలను ఒక క్రమ పద్ధతిలో నాటారు.


ఆహ్లాదం కాదు.. అపాయం సుమా

జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు నడక దారిలో ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన తామర కొలను ఇది. చిన్నారులు ప్రమాదకరంగా జలకాలాడుతూ కనిపించారు. ఊహించని ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేయలేం. పార్కు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు.


రోగుల సేవకు సదా సిద్ధంగా..

కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి వచ్చే జనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  దాంతో అత్యవసరంగా వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో స్ట్రెచర్లు సిద్ధం చేసి ఆవరణలో అందుబాటులో ఉంచారు.


కరోనా వేళ.. ఏదీ పోటీ కళ!

పోటీ పరీక్షల ప్రకటన వెలువడగానే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నిరుద్యోగులు చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయంలో వాలిపోతారు. రాత్రింబవళ్లు పరీక్షలకు సిద్ధమవుతూ కనిపిస్తారు.  ఈ పర్యాయం యువత ఆశలకు ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మళ్లీ గండి కొట్టింది. గ్రంథాలయ ఆవరణ నిర్మానుష్యంగా మారింది.  


ఆకొప్పుకొనేలా..

వినూత్నంగా కనిపించాలని తలపై కొప్పు వేసుకున్న ఈయన పేరు మొబిన్‌పౌల్‌. ఇఫ్లూలో పీహెచ్‌డీ చదువుతున్న ఇతనికి సైక్లింగ్‌ అంటే సరదా. కాస్త ఆకర్షణీయంగా కనిపించేందుకు జట్టు చివర్లలో రంగు వేసుకున్నా అంటున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని