Dasari arun: మద్యం మత్తులో బీభత్సం సృష్టించిన దాసరి అరుణ్‌ కుమార్‌

దర్శక నిర్మాత, దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌ కుమార్‌ బుధవారం రాత్రి బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతో

Published : 21 Jan 2022 01:38 IST

జూబ్లీహిల్స్‌: దర్శక నిర్మాత, దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌ కుమార్‌ బుధవారం రాత్రి బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి అరుణ్‌ బుధవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని సయ్యద్‌ నగర్‌కు కారులో వెళ్లాడు. ఆ సమయంలో మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అదే బస్తీకి చెందిన సయ్యద్‌ అఫ్జల్‌ అలీ ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అతను బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో దాసరి అరుణ్‌ కుమార్‌పై ఫిర్యాదు చేశాడు. తన వాహనంతోపాటు మరో నాలుగు వాహనాలు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు అరుణ్‌ కుమార్‌పై సెక్షన్‌ 279, 336, మోటారు వాహనాల చట్టంతో పాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం దాసరి అరుణ్‌ కుమార్‌ నేరుగా బంజారాహిల్స్‌ పోలీసుల ముందు హాజరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని