logo

అర్హులను గుర్తించి ఇంటింటికీ వెళ్లి టీకా: కలెక్టర్‌

జిల్లాలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీని నూరు శాతం పూర్తి చేశామని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. గురువారం దృశ్య మాధ్యమం ద్వారా మంత్రులు

Published : 21 Jan 2022 01:05 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ నిఖిల, చిత్రంలో అదనపు పాలనాధికారి చంద్రయ్య, జడ్పీ సీఈవో

జానకిరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా టీకా మొదటి డోసు పంపిణీని నూరు శాతం పూర్తి చేశామని జిల్లా పాలనాధికారిణి నిఖిల తెలిపారు. గురువారం దృశ్య మాధ్యమం ద్వారా మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిఖిల జిల్లాలో టీకాల పంపిణీ, పరీక్షలు, కొవిడ్‌ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. రెండో డోసుకు అర్హులైన వారందరిని గుర్తించి ఇంటింటికి వెళ్లి టీకా వేస్తున్నారన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఏన్‌ఏంలు, పురపాలక, పంచాయతీ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వేను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అని తెలుసుకుంటున్నారని అన్నారు. కొవిడ్‌ లక్షణాలతో బాధపడితే వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయిస్తున్నామని పేర్కొన్నారు. పాజిటివ్‌ ఉన్న వారికి ఇంటి వద్దనే వ్యక్తిగత కట్టడిలో ఉండాలని సూచించాలని, వారికి కొవిడ్‌ కిట్‌ను పంపిణీ చేస్తున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా వైద్యాధికారి తుకారాంభట్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని