logo

మస్తాన్‌వలీని విచారించనున్న సీసీఎస్‌ పోలీసులు

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వాహా చేసిన కేసులో నిందితుడు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీని సీసీఎస్‌ పోలీసులు మరోసారి

Published : 21 Jan 2022 01:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వాహా చేసిన కేసులో నిందితుడు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీని సీసీఎస్‌ పోలీసులు మరోసారి విచారించనున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌ శాఖలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ మదుపు చేసిన రూ.3.98 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు నకిలీ రసీదులు ఇచ్చింది మస్తాన్‌ వలీ మేనేజర్‌గా ఉన్నప్పుడేనని ఆధారాలు లభించడంతో సీసీఎస్‌ పోలీస్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన మస్తాన్‌వలీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని