logo

మత్తులో కారుతో బీభత్సం

సినీ నటుడు దాసరి అరుణ్‌కుమార్‌ మద్యం మత్తులో బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం సృష్టించారు. స్థానికుల, బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. అరుణ్‌ బుధవారం రాత్రి

Published : 21 Jan 2022 01:27 IST

సినీ నటుడు దాసరి అరుణ్‌కుమార్‌ అరెస్టు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సినీ నటుడు దాసరి అరుణ్‌కుమార్‌ మద్యం మత్తులో బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం సృష్టించారు. స్థానికుల, బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. అరుణ్‌ బుధవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి ఎఫ్‌ఎన్‌సీసీ క్లబ్‌లో మద్యం తాగారు. రాత్రి 11 గంటల తరువాత కారులో బయలుదేరాడు. ఇటీవల కాలంలో అరుణ్‌ దారి మరిచిపోతున్నాడని, అతని స్నేహితుడు మరో వాహనంపై వెంట వెళ్లాడు. అపోలో నుంచి నేరుగా వెళ్లాల్సిన అరుణ్‌ యూటర్న్‌ తీసుకొని నేరుగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12 వైపు వేగంగా వెళ్లాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అక్కడి కమాన్‌ నుంచి సయ్యద్‌నగర్‌ వైపు కారును పరుగెత్తించాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొంది. ఇది గమనించిన స్థానికులు బయటకు వచ్చి కారులో ఉన్న అరుణ్‌ను పట్టుకున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా రక్తంలో మద్యం మోతాదు శాతం 405 బీఏసీగా వచ్చింది. సయ్యద్‌నగర్‌వాసి సయ్యద్‌ అఫ్జల్‌ అలీ తన వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 41ఎ సీఆర్‌పీసీ కింద నోటీసు అందించి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని