logo

నేటి నుంచి చిత్తారమ్మ జాతర

గాజులరామారంలోని చిత్తారమ్మ జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు ఉదయం 8 గంటలకు గణపతి పూజ,

Published : 21 Jan 2022 01:27 IST

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: గాజులరామారంలోని చిత్తారమ్మ జాతర శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, దీక్షాధారణ, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలు ఉంటాయి. కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి సందర్భంగా జాతరకు ఆలయ నిర్వహణ కమిటీ, పోలీసుల ఆధ్వర్యంలో ఆంక్షలు కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో దుకాణాలకు అనుమతి లేకపోవడంతో సందడి లేకుండాపోయింది. ఆలయ ప్రాంగణంలో మేకలు, కోళ్లు కోయడానికి అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రధాన జాతర జరిగే ఆదివారం రోజున నిర్వహించే ఫలహారం బండి ఊరేగింపు, సోమవారం రంగం కార్యక్రమాలు రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని