logo

కంపు కాదు.. ఇంపే!

గ్రేటర్‌ వ్యాప్తంగా ఇళ్ల మధ్య నిర్మించే మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) విషయంలో జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది. సాధారణంగా ఎస్టీపీలను ద్వితీయ శుద్ధి(సెకండరీ రీసైక్లింగ్‌) విధానంలో

Published : 21 Jan 2022 01:49 IST

జనావాసాల్లో నిర్మించే ఎస్టీపీలకు ప్రత్యేక జాగ్రత్తలు

గ్రేటర్‌లో 12 ప్రాంతాల్లో ఆధునికంగా మురుగు శుద్ధి

ఈనాడు, హైదరాబాద్‌

అంబర్‌పేటలోని మురుగు శుద్ధి కేంద్రం

గ్రేటర్‌ వ్యాప్తంగా ఇళ్ల మధ్య నిర్మించే మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) విషయంలో జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది. సాధారణంగా ఎస్టీపీలను ద్వితీయ శుద్ధి(సెకండరీ రీసైక్లింగ్‌) విధానంలో రూపొందిస్తారు. ప్రస్తుతం నగరంలోని 20 ఎస్టీపీలు ఈ విధానంలోనే ఉన్నాయి. తాజాగా నిర్మించనున్న 31 కేంద్రాల్లో 12 కేంద్రాలను ఆధునిక విధానంలో ఏర్పాటు చేయనున్నారు. వాసన రాకుండా, స్థానికులకు ఇబ్బందులు లేకుండా ఆర్‌వో (రివర్స్‌ అస్మోసిస్‌) పద్ధతిలో మురుగు శుద్ధి చేయనున్నారు. ఈ ఎస్టీపీల్లో శుద్ధి చేసిన తర్వాత జలం.. నది నీటి ప్రమాణాల వద్ద ఉంటుంది. ఆ నేరుగా మూసీలో కలిపినా, తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు వాడినా ఇబ్బంది ఉండదు.

వందశాతం లక్ష్యంగా.

గ్రేటర్‌లో 100 శాతం మురుగు శుద్ధి లక్ష్యంగా రూ.3,800 కోట్లతో 31 ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వచ్చే దసరా నాటికి వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో నిత్యం రెండు వేల మిలియన్‌ లీటర్ల మురుగు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 740 ఎంఎల్‌డీలు మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మిగిలినవాటిలో 80 శాతం ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండగా, మరో 20 శాతం స్థానిక చెరువుల్లోకి చేరుతోంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ప్రస్తుతమున్న ఎస్టీపీలకు భిన్నంగా కొత్త నిర్మించే 12 కేంద్రాల్లో తృతీయ శుద్ధిని ప్రామాణికంగా తీసుకోనున్నారు. మురుగు నిర్వహణలో తృతీయ శుద్ధి అనేది చివరి దశ. ఇందులో భాగంగా మురుగులో పీహెచ్‌ సమతుల్యత, బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ), ఘన వ్యర్థాలను ప్రమాణాల మేరకు తగ్గిస్తారు. ఈ ప్రక్రియలో స్థానికంగా ఉండే వారికి వాసన రాదు. పర్యటకానికి అనుగుణంగా ఆయా కేంద్రాల వద్ద పార్కులు అభివృద్ధి చేస్తామని జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు.

కేంద్రాలు ఇక్కడే...

కేంద్రం              సామర్థ్యం (ఎంఎల్‌డీల్లో)

ప్యాకేజీ-1

పెద్ద చెరువు              17.5

రామచెరువు              30.00

కాప్రా చెరువు             20.00

కోకాపేట చెరువు          15.0

మిరాలం-1               11.5

ప్యాకేజీ-2

దుర్గంచెరువు             7.0

అంబర్‌ చెరువు           37.0

ఖాజాకుంట              20.0

మూలకత్వా చెరువు       33.5

ఖాజాగూడ             21.0

ఫాక్స్‌సాగర్‌             14.0

వెన్నెలగడ్డ             110.0

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని