logo

చిత్రవార్తలు

ప్రముఖ జ్యుయలరీ సంస్థ సేల్స్‌ మేనేజర్‌, సేల్స్‌మెన్‌ ఉద్యోగాలకు గురువారం ముఖాముఖిలు నిర్వహించింది. గచ్చిబౌలి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ఉన్న ఆ సంస్థ శాఖ

Published : 21 Jan 2022 02:11 IST

నిరీక్షణ ఫలించేదెవరికి.. ఉపాధి లభించేదెవరికి?

ప్రముఖ జ్యుయలరీ సంస్థ సేల్స్‌ మేనేజర్‌, సేల్స్‌మెన్‌ ఉద్యోగాలకు గురువారం ముఖాముఖిలు నిర్వహించింది. గచ్చిబౌలి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ఉన్న ఆ సంస్థ శాఖ వద్ద అభ్యర్థులు భారీగా బారులు తీరారు.


పోస్టు డబ్బా కాదు.. స్విచ్‌ బోర్డుకు రక్షణ

ఎర్ర రంగుతో పోస్టు డబ్బాలా ఉంది కదూ! ఇందులో ఉత్తరాలు వేద్దామనుకుంటే పప్పులో కాలేసినట్లే. నిజానికి ఇది పోస్టు డబ్బా కాదు. హైఓల్టేజీ విద్యుత్తు స్విచ్‌ బోర్డులకు పోస్టు డబ్బా ఆకారంలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థ ఇది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం వద్ద కనిపించింది.


పోత విలాపం!

ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్‌ కళాశాల వద్ద నిత్యం సందడిగా ఉండే పావురాలకు ఎవరూ దాణా వేయవద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వేస్తే జరిమానా విధిస్తామన్న హెచ్చరికతో ఎవరూ గింజలు వేయడానికి ముందుకు రావడం లేదు. దాంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ ఆహారానికి అలవాటు పడిన కపోతాలు తిండిలేక మృత్యువాత పడుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని