TS News: ఓపిక నశిస్తే పోరాటానికి దిగాల్సి వస్తుంది: కేటీఆర్‌

చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు

Updated : 21 Jan 2022 21:58 IST

సిరిసిల్ల: చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణ, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలపై సిరిసిల్ల కలెక్టరేట్‌లో సమీక్ష తర్వాత  మాట్లాడిన కేటీఆర్‌.. తాజాగా ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. ఆ లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా పంపిస్తున్నామని, రాజకీయాలు మాని.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని కేటీఆర్‌ హితవు పలికారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు