logo

పరిహారానికి.. అర్జీల వెల్లువ

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వీటిని పరిశీలించి అర్హులకు విపత్తు నిర్వహణ నిధుల నుంచి 

Published : 22 Jan 2022 01:03 IST

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వీటిని పరిశీలించి అర్హులకు విపత్తు నిర్వహణ నిధుల నుంచి  కలెక్టర్‌ పరిహారాన్ని మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు 170 అర్జీల పరిశీలన పూర్తయినట్లు వైద్యారోగ్యశాఖాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 9.20 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో రెండేళ్లలో 5,78,278 మందికి కరోనా పరీక్షలు చేసి, 27,948 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. 27,471 మంది కోలుకున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా 477 మంది మృతి చెందారని లెక్కలు చెబుతున్నాయి. అయితే 750 వరకు దరఖాస్తులు వచ్చాయని అంచనా. ఇందుకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కరోనాతో మృతి చెందిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వచ్చిన అర్జీలను వైద్యారోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పురపాలక సిబ్బందితో కూడిన బృందాలు పరిశీలించి, అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. వాస్తవమని తేలితే, ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తున్నారు.

ఈ -సేవా కేంద్రంలో: కొవిడ్‌తో ఎవరైనా మృతి చెందితే సదరు వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. మరణ ధ్రువీకరణ పత్రం, అధికారికంగా ఇచ్చిన పాజిటివ్‌ సర్టిఫికెట్‌, నామినీ గుర్తింపు కార్డు (ఆధార్‌, ఇతర ఏదైనా) తీసుకుని కేంద్రానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తుదారుని వేలిముద్ర తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు రసీదు ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని