logo

విధుల్లో ప్రతిభ చాటితే గుర్తింపు: ఎస్పీ

ఉద్యోగం చిన్నదా పెద్దదా అనే వ్యత్యాసం లేకుండా పోలీసు దుస్తులు(యూనిఫాం) ధరించిన ప్రతి ఒక్కరూ పోలీసు కుటుంబంలో భాగమేనని, ఏ సమస్య వచ్చినా పెద్దగా పరిష్కరించేందుకు ముందుంటానని జిల్లా పోలీసు

Published : 22 Jan 2022 01:03 IST


మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్‌: ఉద్యోగం చిన్నదా పెద్దదా అనే వ్యత్యాసం లేకుండా పోలీసు దుస్తులు(యూనిఫాం) ధరించిన ప్రతి ఒక్కరూ పోలీసు కుటుంబంలో భాగమేనని, ఏ సమస్య వచ్చినా పెద్దగా పరిష్కరించేందుకు ముందుంటానని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో హోంగార్డులతో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హోంగార్డులు రక్షకభటులతో సమానంగా విధులు నిర్వహిస్తారని, వారికి ఏ సమస్యలు వచ్చినా సంకోచించకుండా నేరుగా తనతో చెప్పుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి వారంలో ఒకరోజు కేటాయిస్తామని, కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామన్నారు. విశ్రాంతి గదితో పాటు వారి కుటుంబ సభ్యులకు నెలకోమారు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, వారానికోసారి సెలవు ఇచ్చేలా చూస్తామన్నారు. కౌన్సిలింగ్‌ ద్వారానే హోంగార్డుల బదిలీ ప్రక్రియను చేపడతామన్నారు. పోలీసుశాఖలో విధులు నిర్వహించే అందరం పరస్పర సహాయ, సహకారాలతో స్నేహపూర్వక వాతావరణంలో పని చేయాలని అన్నారు. విధుల్లో నైపుణ్యం, ప్రతిభ కనబరిస్తే అందరిలో గుర్తింపు వస్తుందని అన్నారు. పదవీ విరమణ పొందిన హోంగార్డులను సత్కరించారు. అనంతరం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాయామశాల(జిమ్‌)ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రషీద్‌, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ సీఐలు నాగేశ్వరరావు, శ్రీనివాస్‌రావు, ఆర్‌ఐలు భరత్‌భూషణ్‌, అచ్యుతరావు, రత్నం పాల్గొన్నారు.

హాజరైన హోంగార్డులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని