logo

లిఫ్ట్‌లో ఇరుక్కొని పనిమనిషి మృతి

విశ్రాంత ఆర్‌అండ్‌బి ఉద్యోగి ఇంట్లో పనిచేస్తున్న మహిళ లిఫ్ట్‌లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  షోలాపూర్‌ ప్రాంతానికి చెందిన నరేష్‌, వీణ(38)

Published : 22 Jan 2022 02:13 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: విశ్రాంత ఆర్‌అండ్‌బి ఉద్యోగి ఇంట్లో పనిచేస్తున్న మహిళ లిఫ్ట్‌లో ఇరుక్కొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  షోలాపూర్‌ ప్రాంతానికి చెందిన నరేష్‌, వీణ(38) తమ ఇద్దరు పిల్లలతో కలిసి కార్వాన్‌లో ఉంటున్నారు. భర్త అక్కడే దర్జీగా పనిచేస్తుండగా వీణ హౌజ్‌కీపింగ్‌ విభాగంలో పనిచేసి కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. షేక్‌పేట సమీపంలోని లక్ష్మీనగర్‌లో నివసించే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మధుసూదన్‌రెడ్డి కుమారుడు, కోడలు చెన్నైలో నివసిస్తున్నారు. వారి చిన్నారితో శనివారం (నేడు) హైదరాబాద్‌కు రానుండటంతో ఇంట్లో పనిచేసేందుకు మధుసూదన్‌రెడ్డి తనకు తెలిసిన కుర్మయ్య అనే హౌజ్‌కీపింగ్‌ సూపర్‌వైజర్‌ను సంప్రదించాడు. దీంతో కుర్మయ్య తనకు తెలిసిన వీణను పనికి కుదిర్చాడు. ఈ క్రమంలో మధుసూదన్‌రెడ్డి   ఇంట్లో పనిచేస్తున్న ఆమె సాయంత్రం మూడో అంతస్తులో కుమారుడు, కోడలికి కేటాయించిన గదిని శుభ్రం చేసేందుకు వెళ్లేందుకు లిఫ్టు ఎక్కింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.    పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని