logo

భాగ్యనగరచిత్ర వార్తలు

మూడో దశలో కరోనా భారీగా విస్తరిస్తోంది. గ్రేటర్‌తోపాటు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో గంటకు వంద మందికి సోకుతోంది. గడిచిన 24 గంటల్లో 2388 కేసులు నమోదయ్యాయి. బల్దియాలో గరిష్టంగా 1670 మందికి నిర్ధారణ

Published : 22 Jan 2022 02:13 IST

గంటకు వంద మందికి వైరస్‌

శంషాబాద్‌ విమానాశ్రయ మార్గంలో ఏర్పాటు చేసిన చిత్రం మాస్కు ఆవశ్యకత చాటుతుండగా ఆ పక్కనే మూతికి రక్షణ లేకుండా వెళుతున్న వాహనదారులు

మూడో దశలో కరోనా భారీగా విస్తరిస్తోంది. గ్రేటర్‌తోపాటు, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో గంటకు వంద మందికి సోకుతోంది. గడిచిన 24 గంటల్లో 2388 కేసులు నమోదయ్యాయి. బల్దియాలో గరిష్టంగా 1670 మందికి నిర్ధారణ అయింది. మేడ్చల్‌లో 417 మందికి, రంగారెడ్డిలో 301 మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో బల్దియా ఇంటింటా జ్వర సర్వే చేపట్టి, లక్షణాలున్న వారికి వైద్య సలహాలతోపాటు ఔషధాలు అందజేస్తోంది. కొవిడ్‌ నిబంధనలపై ప్రచారాన్నీ ఉద్ధృతం చేసింది.

సీతాఫల్‌మండిలో కరోనా కేసులు ఎక్కువున్నాయని, అందుకే రక్షణ తెర ఏర్పాటు చేసుకున్నామని దుకాణదారు లత సర్వే సిబ్బందికి వివరించారు.


చిత్తారమ్మదేవి జాతరకు అంకురార్పణ

గాజులరామారం చిత్తారమ్మదేవి జాతర శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ కూన అంతయ్యగౌడ్‌తో పాటు ప్రధాన కార్యదర్శి బాలరాజు, సలహాదారులు పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకొన్నారు.  

- న్యూస్‌టుడే, షాపూర్‌నగర్‌  


ఐటీ నగరి నీటి వనరులు ఇలానా మరి!

కాశ హార్మ్యాలతో మహా నగరంలోని ఐటీ కారిడార్‌ ఒకపక్క ప్రగతి పథంలో దూసుకుపోతుండగా.. మరోపక్క నీటి వనరుల పరిస్థితి దారుణంగా మారుతోంది. గుర్రపుడెక్క, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఖాజాగూడ చెరువు అధ్వానంగా మారి కనిపించింది.


ట్రాఫిక్‌ కష్టాలు కనరా

శంషాబాద్‌ సమీపంలోని ఉందా నగర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద వాహనదారులు నానా కష్టాలు పడుతున్నారు. శుక్రవారం అరగంటకు పైగా గేటు వేయడంతో వాహనాలు బారులు తీరాయి. అత్యవసరంగా వెళ్లే వారి అవస్థలు అన్నీఇన్నీ కావు.


హరితానికి హారం.. ముందే సిద్ధం

చ్చే వర్షాకాలంలో హరితహారానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందిరా పార్కులోని నర్సరీల్లో లక్షా 50 వేల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో ఇవి నాటేందుకు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని