logo

అల్లం మాటున గంజాయి రవాణా!

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును శంషాబాద్‌ ఎస్‌వోటీ, మియాపూర్‌ పోలీసులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో నిఘా వేసిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన

Published : 22 Jan 2022 02:13 IST


ప్యాకెట్లను పరిశీలిస్తున్న స్టీఫెన్‌ రవీంద్ర

ఈనాడు, హైదరాబాద్‌ మియాపూర్‌, న్యూస్‌టుడే: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును శంషాబాద్‌ ఎస్‌వోటీ, మియాపూర్‌ పోలీసులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో నిఘా వేసిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన అశోక్‌ ఖూలే(49), అమోల్‌ అథ్వాలె(39), రాహుల్‌ కుమార్‌ సింగ్‌(22), విలాస్‌ జగన్నాథ్‌ ఫచోరే(39), ఫిరోజ్‌ మోమిన్‌(41), సుధాం ఘోటేకర్‌(45)లను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు వికాస్‌ జాదవ్‌, సుభాష్‌ కుమార్‌ పరారయ్యారు. వీరి వద్ద 800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.80కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి, మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.తిరుపతిరావు, ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్‌రెడ్డితో కలసి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ ఎం.స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాకు చెందిన వికాస్‌ జాదవ్‌ మత్తు పదార్థాల స్మగ్లర్‌. ఒడిశాలో గంజాయి సాగు చేసే సుభాష్‌ కుమార్‌ అలియాస్‌ రాహుల్‌ కుమార్‌తో సంబంధాలున్నాయి. ఇద్దరూ కలసి చాలాసార్లు సరకు రవాణా చేశారు. ఇదే ధీమాతో 800 కిలోల గంజాయి మహారాష్ట్ర పంపుతానంటూ సుభాష్‌ వారం కిందట వికాస్‌కు సమాచారమిచ్చాడు. ఈ పనుల్లో అనుభవమున్న అశోక్‌, అథ్వాలే, రాహుల్‌కుమార్‌సింగ్‌, విలాస్‌, మోమిన్‌, ఘోటేకర్‌లు ముఠాగా ఈనెల 19న డీసీఎంలో బయల్దేరారు. పోలీసులు అనుమానించకుండా అల్లం రవాణా చేస్తున్నటు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని