logo

ఆందోళనొద్దు..చర్యలు చేపట్టాం: సీఎస్‌

మూడో దశ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇంటింటి జ్వర సర్వేను శుక్రవారం ఖైరతాబాద్‌లోని

Published : 22 Jan 2022 02:13 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మూడో దశ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇంటింటి జ్వర సర్వేను శుక్రవారం ఖైరతాబాద్‌లోని హిల్‌టాప్‌ కాలనీలో ఆయన పరిశీలించారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్‌ కిట్లు సిద్ధంగా ఉంచామని, రోజూ లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. బల్దియా కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని