logo

పరిశీలన.. పరిరక్షణ

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పరిశీలన.. పరిరక్షణ విధానాన్ని బల్దియా అవలంబిస్తోంది. గ్రేటర్‌లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో కాలనీలు, బస్తీల్లో కలిపి 40 శాతానికి పైగా ఇళ్లలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని

Published : 22 Jan 2022 02:13 IST


కోఠిలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పరిశీలన.. పరిరక్షణ విధానాన్ని బల్దియా అవలంబిస్తోంది. గ్రేటర్‌లో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో కాలనీలు, బస్తీల్లో కలిపి 40 శాతానికి పైగా ఇళ్లలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారి చేసినట్లు బల్దియా దోమల నివారణ విభాగం తెలిపింది. 150 డివిజన్లలోని 4,846 కాలనీల్లో ఇంటింటా జర్వ సర్వే శుక్రవారం ప్రారంభించింది. సగటున ఒక్కో డివిజన్‌లో 90 నుంచి 120 ఇళ్లను పరిశీలించింది. మల్కాజిగిరి సర్కిల్‌లోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లో 117 ఇళ్లలో సర్వే చేయగా 21 మందిలో కరోనా లక్షణాలు కన్పించాయి. 46 ఇళ్లలో క్రిమి సంహారక ద్రావణం పిచికారి చేశారు. పూర్తి గణాంకాలను శనివారం ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని