logo

ఉండేందుకు ఇళ్లు.. తాగేందుకు నీళ్లు

అవుటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కొల్లూరులో బల్డియా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు గోదావరి జలాలు అందనున్నాయి. ముత్తంగి నుంచి కోకాపేట ఓఆర్‌ఆర్‌ వెంట 18 కి.మీ. మేర 3000 ఎంఎం డయాతో భారీ పైపులైన్‌ను

Published : 22 Jan 2022 02:19 IST

కొల్లూరు రెండు పడక గదుల నివాసాల వరకు గోదావరి పైపులైను

కొల్లూరులోని రెండు పడక గదుల ఇళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కొల్లూరులో బల్డియా నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లకు గోదావరి జలాలు అందనున్నాయి. ముత్తంగి నుంచి కోకాపేట ఓఆర్‌ఆర్‌ వెంట 18 కి.మీ. మేర 3000 ఎంఎం డయాతో భారీ పైపులైన్‌ను జలమండలి ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. కొల్లూరులోని రైల్వే ట్రాక్‌ వద్ద పనులు నిలిచాయి. అక్కడ అండర్‌పాస్‌ నిర్మించి పైపులైన్లు వేస్తున్నారు. ఇవి పది రోజుల్లో పూర్తి కానున్నాయి. శుక్రవారం జలమండలి ఎండీ దానకిషోర్‌ ఇతర అధికారులు ఈ పనులను పరిశీలించారు. కొల్లూరు పరిధిలో రెండు ఫేజుల్లో 17,712 ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి గోదావరి జలాలను అందించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ప్రస్తుత పైపులైనుతో ఈ ఇళ్లతోపాటు కొల్లూరు చుట్టుపక్కల మరో 40-50 గ్రామాల దాహార్తి తీరనుంది. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ రిజర్వాయర్లు నిర్మిస్తోంది.
* ఇక కొల్లూరు జంక్షన్‌ నుంచి కోకాపేటలోని 500 ఎకరాల్లో నిర్మిస్తున్న హెచ్‌ఎండీఏ లేఅవుట్‌కు ఇదే పైపులైన్‌ను కొనసాగించనున్నారు. తెల్లాపూర్‌ నుంచి నల్లగండ్ల రిజర్వాయర్‌ వరకు 7.5 కి.మీ. మేర 1000 ఎంఎం సామర్థ్యంతో మరో పైపులైన్‌ నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని