బండి సంజయ్‌ ఫిర్యాదు.. సీఎస్‌ సహా పలువురికి లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు

భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఫిర్యాదుపై తెలంగాణ సీఎస్‌, ముఖ్య కార్యదర్శికి

Updated : 22 Jan 2022 12:03 IST

హైదరాబాద్‌: భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఫిర్యాదుపై తెలంగాణ సీఎస్‌, ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. డీజీపీ, కరీంనగర్‌ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీ, కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌లకు కూడా ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. 

బండి సంజయ్‌పై కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ అకారణంగా దాడి చేశారన్న ఫిర్యాదుపై పార్లమెంటరీ ప్రివిలేజ్‌ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. నిన్న లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు బండి సంజయ్‌ తన వాంగ్మూలం ఇచ్చారు. కరీంనగర్‌లో జరిగిన ఘటన వివరాలను తెలిపారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో జాగరణ దీక్షకు దిగగా పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్టు చేశారని.. పార్లమెంట్‌ సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని కమిటీకి వివరించారు. గ్యాస్‌ కట్టర్లు ఉపయోగించి తలుపులు బద్దలు కొట్టారని చెప్పారు. ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చిన నేపథ్యంలో ప్రివిలేజ్‌ కమిటీ అధికారులకు నోటీసులు పంపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని