logo

శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద ఎత్తున

Updated : 22 Jan 2022 12:37 IST

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోటి 36లక్షల విలువైన 2715.800గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. ఆ వ్యక్తి తన బ్యాగులో రెండున్నర కిలోలకు పైగా ఉన్న గోల్డ్‌ చైన్‌లతో పాటు బంగారాన్ని పేస్టుగా చేసి తీసువచ్చాడు. ఆ బంగారాన్ని సీజ్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని