logo

నేటినుంచి ఆర్‌ఆర్‌ ట్రస్ట్‌ వైద్య సేవలు

గ్రామీణ నేపథ్యమున్న వికారాబాద్‌ జిల్లా ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్య సేవలందిచేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ట్రస్ట్‌ శ్రీకారం చుట్టింది. ట్రస్ట్‌ ఛైర్మన్‌ రంజిత్‌రెడ్డి నేడు (ఆదివారం) ధారూర్‌ మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా

Published : 23 Jan 2022 06:40 IST

ప్రారంభించనున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధంగా అంబులెన్స్‌ వాహనం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: గ్రామీణ నేపథ్యమున్న వికారాబాద్‌ జిల్లా ప్రజలకు మెరుగైన, ఉచిత వైద్య సేవలందిచేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ట్రస్ట్‌ శ్రీకారం చుట్టింది. ట్రస్ట్‌ ఛైర్మన్‌ రంజిత్‌రెడ్డి నేడు (ఆదివారం) ధారూర్‌ మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు.  వారంలో ఒక రోజు వైద్యుల బృందం ఓ గ్రామాన్ని సందర్శిస్తుంది. నిపుణులైన వైద్యులు, ఇతర సిబ్బంది పరీక్షలు చేస్తారు. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి సౌకర్యాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనాన్ని సుమారు రూ.కోటి వెచ్చించి డిజైన్‌ చేశారు.  
ఒక్కరూపాయీ వెచ్చించాల్సిన పనిలేదు: బాధితులు ఒక్క రూపాయికూడా చేతినుంచి పెట్టాల్సిన పనిలేదని అన్నీ ఉచితంగానే అందిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్లమెంటు సభ్యుడు రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాదరణను బట్టి ప్రతి నియోజకవర్గానికి వైద్యుల బృందం, అన్ని రకాల మౌలిక సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌ వాహనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని