logo

వారంలోగా దళిత బంధు అర్హుల జాబితా: సబితారెడ్డి

జిల్లాలోని ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం అర్హుల జాబితాను వారం రోజుల్లో సమర్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. శనివారం దళిత బంధు పథకంపై జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో దృశ్య మాధ్యమ సమావేశంలో

Published : 23 Jan 2022 03:09 IST

మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం అర్హుల జాబితాను వారం రోజుల్లో సమర్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. శనివారం దళిత బంధు పథకంపై జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో దృశ్య మాధ్యమ సమావేశంలో ఆమె మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేలదే అని, పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఒక అధికారి ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారని, ఈ ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి చేసి మార్చి నెలల్లో పథకాలను అమలు చేయాలని సూచించారు. మొదటి విడతగా వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌లో నియోజక వర్గానికి 100 మంది చొప్పున 400 మందిని ఎంపిక చేయాలన్నారు. నవాబ్‌పేట మండల జాబితా రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్‌, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి మహేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, అదనపు పాలనాధికారి మోతీలాల్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5లోగా సిద్ధం: కలెక్టర్‌
జిల్లాలో దళిత బంధు పథకం కోసం అర్హులైన దళితులను ఫిబ్రవరి 5వ తేదీలోగా ఎంపిక చేస్తామని పాలనాధికారిణి నిఖిల తెలిపారు. శనివారం దృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వివరించారు. జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్‌డీఓ కృష్ణన్‌, డీఎస్‌సీడీఒ మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబుమోజెస్‌, ఎల్‌డీఎం రాంబాబు, జిల్లా వ్యవసాధికారి గోపాల్‌, ఆర్డీఒ విజయకుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని