logo

అంకురాల్లోకి నిధుల ప్రవాహం

నగరానికి చెందిన అంకుర సంస్థలకు పెట్టుబడుల ప్రవాహం వస్తోంది. వినూత్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపాయి. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో సెంటర్‌

Published : 23 Jan 2022 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి చెందిన అంకుర సంస్థలకు పెట్టుబడుల ప్రవాహం వస్తోంది. వినూత్న ఆలోచనలతో ఏర్పాటు చేసిన అంకురాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపాయి. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌(సీఐఈ)లో ఇంక్యుబేట్‌ అయిన 15 అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. ఏటా సీఐఈ ఆధ్వర్యంలో ద్వైవార్షిక డెమో దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఇందులో తమకు నచ్చిన అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా జరిగిన డెమో డేలో 30 మంది పారిశ్రామివేత్తలు పెట్టుబడికి ముందుకు వచ్చారు. ‘గత ఐదేళ్లలో 25 అంకురాలకు చేయూత లభించింది, బ్లూసెమీ, డ్రీమ్‌వీయూ వంటి స్టార్టప్‌లకు ఎ+ నిధులు లభించాయి’ అని సీఐఈ కొ-ఇన్నోవేషన్‌ ప్రొ.రమేశ్‌ లోగనాథన్‌ తెలిపారు.
సీడ్‌ దశలో నిధులు సాధించినవి..
* ఇంటెక్‌ హర్నెస్‌ - రూ.22.31లక్షలు
* మ్యాచ్‌డే ఏఐ - రూ.52.07లక్షలు
* వ్యోమిక్‌ ఇన్నొవేషన్స్‌ - రూ.9.67లక్షలు
ఏంజెల్‌ దశలోని సంస్థలు..
* హోమ్‌గ్రౌండ్‌ - రూ.22.31లక్షలు
* సీతోస్‌ ఇండియా - బూట్‌ స్ట్రాప్‌డ్‌..
* మాచ్‌స్టాజ్‌ - రూ.71.41లక్షలు
* నెక్ట్స్‌మీట్‌ - రూ.96.70లక్షలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని