logo

2.715కిలోల బంగారం పట్టివేత

ఓ ప్రయాణికుడి సామగ్రిలో కిలోల కొద్దీ అక్రమ బంగారం బయట పడింది. ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ స్థాయిలో అక్రమ బంగారం పట్టుబడటం ఇది రెండవ సారి. భద్రతాధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు

Published : 23 Jan 2022 03:09 IST

స్వాధీనం చేసుకున్న బంగారం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఓ ప్రయాణికుడి సామగ్రిలో కిలోల కొద్దీ అక్రమ బంగారం బయట పడింది. ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీ స్థాయిలో అక్రమ బంగారం పట్టుబడటం ఇది రెండవ సారి. భద్రతాధికారులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు దుబాయ్‌ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీస్‌లో స్వదేశానికి బయలుదేరాడు. ఈ క్రమంలో 2.715 గ్రాముల బంగారాన్ని గొలుసులు, కొంత కరిగించి ముద్ద చేశాడు. విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ యంత్రాలకు కనిపించకుండా నల్ల రంగు కాగితంలో చుట్టి సామగ్రిలో రహస్యంగా తరలిస్తున్నాడు. భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని క్షుణ్నంగా తనిఖీలు చేశారు. సామగ్రిలో దొరికిన రూ.1.36 కోట్ల విలువైన అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని