logo

డిస్కంలో డీడీల గోల్‌మాల్‌: విచారణకు ఆదేశం

విద్యుత్తు వినియోగదారులు లోడు క్రమబద్ధీకరణకు గతంలో చెల్లించిన డీడీలు పక్కదారి పట్టడంపై ‘డిస్కంలో డీడీల గోల్‌మాల్‌’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో

Published : 23 Jan 2022 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు వినియోగదారులు లోడు క్రమబద్ధీకరణకు గతంలో చెల్లించిన డీడీలు పక్కదారి పట్టడంపై ‘డిస్కంలో డీడీల గోల్‌మాల్‌’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రికార్డులు తనిఖీ చేసి, నివేదిక ఇవ్వాలని కార్పొరేట్‌ కార్యాలయంలోని కస్టమర్‌ సర్వీసెస్‌ డీఈకి సూచించారు. వినియోగదారుల నుంచి డెవలప్‌మెంట్‌ ఛార్జీలు కట్టించుకుని, రికార్డుల్లో ఇప్పటివరకు లోడు క్రమబద్ధీకరణ కాని కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కొందరు వినియోగదారులైతే బిల్లుతో పాటు డెవలప్‌మెంట్‌ ఛార్జీలను సిబ్బంది చేతికిచ్చారు. ఆధారాలు లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి. అన్ని సెక్షన్లలో రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని