logo

ఆలస్యం.. అనర్థదాయకం

సికింద్రాబాద్‌లో ఉంటున్న వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు ఉండటంతో ఈ నెల 18న స్థానిక ప్రభుత్వ కరోనా పరీక్ష కేంద్రంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నాడు. ఒక రోజంతా నిరీక్షించినా ఫలితం రాకపోయేసరికి తనకేమీ కాలేదని

Published : 24 Jan 2022 01:42 IST

3 రోజుల తర్వాతే ఆర్టీపీసీఆర్‌ ఫలితం!
ఈలోపు తిరుగుతున్న జనం.. వ్యాపిస్తున్న వైరస్‌

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో ఉంటున్న వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు ఉండటంతో ఈ నెల 18న స్థానిక ప్రభుత్వ కరోనా పరీక్ష కేంద్రంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకున్నాడు. ఒక రోజంతా నిరీక్షించినా ఫలితం రాకపోయేసరికి తనకేమీ కాలేదని బయట తిరగడం ప్రారంభించాడు. 21న ఉదయం పాజిటివ్‌గా ఆయన ఫోన్‌కు సమాచారం రావడంతో ఇంటికే పరిమితమయ్యాడు. అప్పటికే నష్టం జరిగిపోయింది. 19, 20 తేదీల్లో పలువుర్ని కలవడం, మాట్లాడంతో వారంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం నగరవ్యాప్తంగా చాలామందిది ఇదే తరహా పరిస్థితి. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల ఫలితాలను ప్రైవేటు ల్యాబ్‌ల్లో గరిష్ఠంగా 24 గంటల్లో అందిస్తుండగా.. ప్రభుత్వ కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో నిత్యం 12-15 వేల వరకు ర్యాపిడ్‌, మరో 3-5 వేలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈ శాంపిళ్లను నిమ్స్‌, గాంధీ, ఐపీఎం ల్యాబ్‌లకు పంపుతున్నారు. అక్కడ తాకిడితో ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. సంబంధితులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయట తిరగడంతో వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి అధికనష్టం జరుగుతుందన్నారు.  


గ్రేటర్‌లో 1421 పాజిటివ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1991 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బల్దియా పరిధిలో వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. జీహెచ్‌ఎంసీలో 1421 మందికి కరోనా నిర్ధారణకాగా, మేడ్చల్‌ జిల్లాలో 308, రంగారెడ్డి జిల్లాలో 262 మంది పాజిటివ్‌లుగా తేలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని