logo

అపోలో ఆసుపత్రిలో అధునాతన చికిత్స

 తొలిసారిగా జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్‌ బెరియాట్రిక్‌ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. సీనియర్‌ కన్సల్టెంట్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డా.శివచరణ్‌రెడ్డి,

Published : 24 Jan 2022 01:42 IST

శస్త్రచికిత్స చేయించుకున్న అబ్దుల్లేతో డా.శివచరణ్‌రెడ్డి, డా.మల్లికార్జున్‌

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే:  తొలిసారిగా జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్‌ బెరియాట్రిక్‌ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. సీనియర్‌ కన్సల్టెంట్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డా.శివచరణ్‌రెడ్డి, డా.మల్లికార్జున్‌, డా.జగన్మోహన్‌రెడ్డి బృందం ఈ శస్త్ర చికిత్స చేసినట్లు పేర్కొన్నారు. సోమాలియాకు చెందిన హిబిబో అబ్దుల్లే మొహమ్మద్‌(40) 180 కిలోల బరువుతో శ్వాస తీసుకోలేకపోవడం, కీళ్ల నొప్పులు, మధుమేహం, పిత్తాశయంలో రాళ్లు, వెంట్రల్‌ హెర్నియా వంటి సమస్యలతో ఆసుపత్రికి రాగా చికిత్స చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని