logo

కొమురవెల్లిలో సందడిగా లష్కర్‌ వారం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో(ఆది)వారం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ‘లష్కర్‌ వారం’గా పిలిచే ఈ ఆదివారం సికింద్రాబాద్‌కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం

Published : 24 Jan 2022 01:42 IST


స్వామివారికి హారతినిస్తున్న  అర్చకులు

చేర్యాల, న్యూస్‌టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో(ఆది)వారం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ‘లష్కర్‌ వారం’గా పిలిచే ఈ ఆదివారం సికింద్రాబాద్‌కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం ఆనవాయితీ.  సికింద్రాబాద్‌తో పాటు పొరుగు జిల్లాలైన వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లన్న భక్తులు తరలివచ్చారు. ఆలయానికి శనివారం వచ్చీరాగానే స్వామివారిని ధూళి దర్శనం చేసుకున్నారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలతో కొండపై వెలిసిన రేణుకా ఎల్లమ్మ గుడికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

ఆలయ ప్రధాన దారిలో బోనాలతో భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని