logo

స్వాతంత్య్ర సమర యోధుల్లో అగ్రగణ్యుడు నేతాజీ

ఆంగ్లేయులను తరిమికొట్టడానికి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పాటు చేసి స్వాతంత్య్ర పోరాటంలో తనదైన శైలిలో పోరాడిన గొప్ప నేతగా సుభాష్‌ చంద్రబోస్‌ చరిత్రలో నిలిచారని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

Published : 24 Jan 2022 01:42 IST

సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న బండారు దత్తాత్రేయ, రాంచందర్‌రావు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఆంగ్లేయులను తరిమికొట్టడానికి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పాటు చేసి స్వాతంత్య్ర పోరాటంలో తనదైన శైలిలో పోరాడిన గొప్ప నేతగా సుభాష్‌ చంద్రబోస్‌ చరిత్రలో నిలిచారని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నేతాజీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర వీరుల్లో అగ్రగణ్యుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మోండామార్కెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కొంతం దీపిక, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, నాయకులు ఆకుల నాగేష్‌, ప్రభుగుప్త, వెంకట్‌రమణి, మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని