logo

Suicide: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఆత్మహత్య

ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Updated : 25 Jan 2022 07:10 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కుదరకపోవడంతో మద్యానికి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 7లో నివసించే ప్రవీణ్‌(30) జిరాక్స్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం కావడంతో రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి ఆదివారం పనిమీద బీహెచ్‌ఈఎల్‌కు వెళ్లగా.. ఇంట్లోని పడకగదిలో ఫ్యానుకు ప్రవీణ్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె తిరిగి వచ్చేసరికి కుమారుడు విగతజీవిగా ఉండటంతో కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. ప్రవీణ్‌ సోదరుడు బాల్‌కుమార్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని