logo

గొలుసు తెంపి.. జేబు నింపుకోవాలని.. పోలీసులకు చిక్కిన స్థిరాస్తి వ్యాపారి

మహిళ మెడలోని మంగళ సూత్రాన్ని చోరీచేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...

Published : 25 Jan 2022 02:07 IST

నాగోలు, న్యూస్‌టుడే: మహిళ మెడలోని మంగళ సూత్రాన్ని చోరీచేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఫలక్‌నుమా సమీపంలోని నవాబ్‌సాబ్‌ కుంటకు చెందిన మహ్మద్‌ అశ్వాక్‌(39) రియల్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఓ రాజకీయ పార్టీలో కొనసాగుతున్నాడు. అత్యవసరంగా డబ్బు అవసరమై బంగారు గొలుసు చోరీ చేయాలనుకున్నాడు. తన స్నేహితుడి పల్సర్‌ బైక్‌తీసుకున్నాడు. స్థానికంగా పరిచయం ఉన్న సంతోష్‌ అనే మరో వ్యక్తిని వెంట తీసుకుని చోరీకి బయలుదేరాడు. ఈ నెల 13న ఎల్బీనగర్‌ రాక్‌టౌన్‌ సమీపంలోని జనప్రియ కాలనీలో ఒంటరిగా వెళ్తోన్న మహిళ మెడలోని 3.5తులాల గొలసు తెంచుకుని పరారయ్యాడు. పోలీసులు. నిందితుడు చోరీ చేశాక.. నేరుగా ఇంటికి వెళ్లకుండా నగరమంతా తిరగడంతో పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని