logo

డబుల్‌ ఇళ్ల సముదాయానికి అవార్డు

ఖైరతాబాద్‌ పరిధి ఇందిరానగర్‌లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి (2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌) ప్రపంచ స్థాయిలో జరిగిన వరల్డ్‌ కాంగ్రెస్‌...

Published : 25 Jan 2022 02:07 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌ పరిధి ఇందిరానగర్‌లో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయానికి (2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌) ప్రపంచ స్థాయిలో జరిగిన వరల్డ్‌ కాంగ్రెస్‌ స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పోలో అవార్డు దక్కింది. నవంబరు 16 నుంచి 18 వరకు స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఎక్స్‌పోలో ఈ అవార్డు అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హౌసింగ్‌ ఓఎస్‌డీ సురేష్‌కుమార్‌ సోమవారం హౌసింగ్‌ శాఖ అధికారులను అభినందించారు. నిరుపేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో జీహెచ్‌ఎంసీ పరిధిలో 111 ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇందిరానగర్‌లో సకల హంగులతో రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 ఇళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక్కడ జి+5 అంతస్తులతో 4 బ్లాక్‌లుగా నిర్మించడంతో పాటు సీసీరోడ్లు, తాగునీరు, 7 లిఫ్టులు, దుకాణాలు, డ్రైనేజీ నిర్మించారు. ఖాళీ స్థలం మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు