logo

సమర్థంగా ఇంటింటి సర్వే: కలెక్టర్‌

జిల్లాలో జ్వరాలకు సంబంధించిన సర్వేను క్షేత్ర స్థాయిలో సమర్థంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాలనాధికారిణి నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 25 Jan 2022 02:44 IST


వివరాలు తెలుసుకుంటున్న పాలనాధికారిణి నిఖిల

పరిగి: జిల్లాలో జ్వరాలకు సంబంధించిన సర్వేను క్షేత్ర స్థాయిలో సమర్థంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాలనాధికారిణి నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరిగి, చిట్యాల గ్రామాల్లో ఆరోగ్య, ఆశ కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వరాలతో బాధపడే వారి వివరాలను సేకరించాలన్నారు. మొదటి, రెండో డోసు టీకాలను తీసుకున్నారా అని పలువురిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, టీకా తీసుకోవడం ద్వారానే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌ ఔషధ కిట్లు అందజేయాలని ఆదేశించారు. పాజిటివ్‌ అని తేలినా భయపడాల్సిన పనిలేదని మందులు సక్రమంగా వాడితే తగ్గుతుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దారు విద్యాసాగర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి తుకారంభట్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని