TS News: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై డీహెచ్‌ క్లారిటీ

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు అన్నారు.

Updated : 25 Jan 2022 12:26 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా వ్యాప్తి లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌) డాక్టర్‌ డి.శ్రీనివాసరావు అన్నారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని ఆయన వివరించారు. ఒక్క జిల్లాలోనూ ఆ రేటు 10శాతం మించలేదని డీహెచ్‌ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది. 

‘‘జీహెచ్‌ఎంసీలో 4.26శాతం, మేడ్చల్‌లో 4.22శాతం.. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 6.45శాతం, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14శాతం పాజిటివిటీ రేటు ఉంది. ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 61శాతంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయి. వారం రోజులుగా లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోంది. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78లక్షల మందికి కిట్లు పంపిణీ చేశాం. 18ఏళ్లలోపు వారిలో 59శాతం మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. రాష్ట్రంలో 2.16లక్షల మందకి ప్రికాషన్‌ డోసు ఇచ్చాం’’ అని డీహెచ్‌ నివేదికలో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని