logo

విస్తరిస్తున్నకొవిడ్‌ మహమ్మారి

కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 915 మందికి మంగళవారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 171 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది.

Published : 26 Jan 2022 01:22 IST

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 915 మందికి మంగళవారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 171 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. జిల్లా ఆసుపత్రి, ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలి ఇలా ఉన్నాయి.

729 మందికి టీకాలు

జిల్లాలో మంగళవారం 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న 729 మందికి కొవిడ్‌ టీకాలను వేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌ తెలిపారు. 22 ప్రాథమిక, నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రిలో ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు. 18 ఏళ్లపైన ఉన్న వారికి మొదటి డోసు 482 మందికి, రెండో డోసు 2871 మందికి వేశామని వివరించారు. మందు జాగ్రత్త టీకాలు 179 మందికి ఇచ్చామని తెలిపారు.

* కలెక్టర్‌, ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఆదేశాల మేరకు మంగళవారం తమ కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకాను వేయించామని వికాస్‌ కశాశాల ప్రిన్సిపల్‌ కె.శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసకులు, పురపాలక సంఘం అధికారులు ప్రభాకర్‌రెడ్డి, మల్లేశం, నర్సిములు, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని