logo

అదనపు డీసీపీ రవికుమార్‌కు భారత పోలీస్‌ పతకం

విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన సైబరాబాద్‌ అదనపు డీసీపీ (ప్రత్యేక విభాగం) ఎస్‌.రవికుమార్‌కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ భారత పోలీసు పతకం దక్కింది. 1991లో ఎస్సైగా పోలీస్‌ శాఖలో చేరిన రవికుమార్‌ తొలుత నిజామాబాద్‌ జిల్లాలో పని చేశారు.

Published : 26 Jan 2022 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన సైబరాబాద్‌ అదనపు డీసీపీ (ప్రత్యేక విభాగం) ఎస్‌.రవికుమార్‌కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ భారత పోలీసు పతకం దక్కింది. 1991లో ఎస్సైగా పోలీస్‌ శాఖలో చేరిన రవికుమార్‌ తొలుత నిజామాబాద్‌ జిల్లాలో పని చేశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌గా కామారెడ్డి, ఆర్మూర్‌, సిద్దిపేటలో పని చేశారు. ఆరేళ్ల క్రితం మియాపూర్‌ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. శివార్లలో దోపిడీ దొంగల ముఠాలపై దృష్టి కేంద్రీకరించారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్‌ చేశారు. ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకంతో సత్కరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తనకు ఐపీఎం లభించడం ఎంతో సంతోషంగా ఉందని రవికుమార్‌ తెలిపారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆయనను అభినందించారు.


ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహకు...

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అందించే జాతీయ పోలీసు సేవా పతకానికి రైల్వే రక్షణ దళం సికింద్రాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ యు.నరసింహ ఎంపికయ్యారు. పోలీసు సేవా పతకాలకు దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లోని రైల్వే రక్షక దళం అధికారులు, ఉద్యోగులను ఎంపిక చేసినట్లు కేంద్ర హోం శాఖ డైరెక్టర్‌ అనంతకిషోర్‌ సారన్‌ ఉత్తర్వులు జారీచేశారు. నరసింహ రెండున్నర దశాబ్దాలుగా ఆర్పీఎఫ్‌లో పలు అవార్డులు దక్కించుకున్నారు. రైల్వే ఆస్తుల పరిరక్షణలో ఎస్‌ఐగా సమర్థవంతంంగా నిర్వహించిన సేవలకుగాను 2003లో పోలీస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు అందుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ హోదాలో కాజీపేట, ఖమ్మం ప్రాంతాల్లో రూ.1.35కోట్ల విలువచేసే రైల్వే కుబుల్‌ డ్రంబ్స్‌, కాపరిపాట్ప్‌ను రికవరీ చేసి 45 ముఠాలను రిమాండుకు తరలించారు. ఇందుకు ఆయనకు 2013లో రైల్వే పోలీసు డీజీ అవార్డు లభిచింది. తాజాగా మాదకద్రవ్యాల నియంత్రణ, రైల్వే ఆదాయాన్ని కొల్లగొడుతూ అక్రమంగా రిజర్వేషన్లు చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నందుకు ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్రం జాతీయ పోలీసుసేవా పతకానికి ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని