logo

ఎవరి పేరు పెట్టాలి?

నగరంలో రహదారులకు పేరు పెట్టాలనే వినతులు జీహెచ్‌ఎంసీ వద్ద వరుస కడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో సుమారు 20 లేఖలు వచ్చాయి.  భాజపా తరఫున గెలిచిన కార్పొరేటర్లు పురాణాపూల్‌ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే, భాజపా సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి పేరు పెట్టాలని కోరారు.

Published : 26 Jan 2022 03:04 IST

బంజారాహిల్స్‌ రోడ్డుకు హమీద్‌ అలీఖాన్‌ పేరు ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రహదారులకు పేరు పెట్టాలనే వినతులు జీహెచ్‌ఎంసీ వద్ద వరుస కడుతున్నాయి. గడిచిన రెండేళ్లలో సుమారు 20 లేఖలు వచ్చాయి.  భాజపా తరఫున గెలిచిన కార్పొరేటర్లు పురాణాపూల్‌ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే, భాజపా సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి పేరు పెట్టాలని కోరారు. తాజాగా ఎంఐఎం నేతలు బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-4కు అలనాటి సినిమాల్లో ప్రతి నాయకుడిగా మెప్పించిన హమీద్‌ అలీ ఖాన్‌(అజిత్‌) పేరు పెట్టాలని కోరారు. గతేడాది డిసెంబరు 15న జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో పురాణాపూల్‌ రోడ్డుకు దివంగత నేత బద్దం బాల్‌రెడ్డి పేరు పెట్టాలన్న తీర్మానంపై చర్చ జరిగింది. తెరాస కార్పొరేటర్లు భాజపా వినతిని తిరస్కరించారు. ఇలా చేస్తే మరిన్ని విజ్ఞప్తులొస్తాయని, రోడ్లకు పేరు పెట్టేందుకు నిర్దిష్ట విధానం రూపొందించాలని అభిప్రాయపడ్డారు. జనవరి మొదటి వారంలో ఎంఐఎం నుంచి మరో విజ్ఞప్తి వచ్చింది. ‘‘హమీద్‌ అలీ ఖాన్‌ భారత సినీ రంగంపై తనదైన ముద్రవేశారు. ఈనెల 27న ఆయన శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు-4కు ఆయన పేరు పెట్టండి’’ అంటూ ఎంఐఎం కార్పొరేటర్లు హమిద్‌ కుటుంబ సభ్యుల తరఫున జీహెచ్‌ఎంసీని కోరారు. నిర్ణయాధికారం కమిషనర్‌కు మాత్రమే ఉంటుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని