logo

జాతీయ భావాన్ని భావితరాలకు తెలియజెప్పాలి

జాతీయతా భావాన్ని భావితరాలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా భారత్‌మాతా ఫౌండేషన్‌

Published : 26 Jan 2022 04:27 IST

వెంకయ్యనాయుడు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: జాతీయతా భావాన్ని భావితరాలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా భారత్‌మాతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారతమాత మహాహారతి కార్యక్రమాన్ని సనత్‌నగర్‌ హిందూ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో నిర్వహించారు. వర్చువల్‌ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. చిత్తశుద్ధి, అంకితభావం, క్రమశిక్షణలతో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.మహాహారతి కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అభినందించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ రానున్న మరో 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు ప్రతీ ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడారు.

కిషన్‌రెడ్డి

దేశభక్తిని ప్రేరేపించిన మహా హారతి

భారతమాతా మహాహారతి కార్యక్రమ కన్వీనర్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యామ్‌సుందర్‌ పర్యవేక్షణలో నిర్వహించిన మహాహారతి కార్యక్రమం దేశభక్తి భావాన్ని ప్రేరేపించింది. కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో విధానంలో దేశవ్యాప్తంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు వర్చువల్‌ విధానంలో ఈషా ఫౌండేషన్‌ నిర్వాహకులు జగ్గీ వాసుదేవ్‌ ప్రసంగించారు. వేడుకలకు ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ కపిల్‌ గోయల్‌, భాజపా నేతలు గౌతంరావు, మేకల సారంగపాణి, కార్పొరేటర్లు సరళ, అమృత, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు గీతామూర్తి, ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గరికపాటి నరసింహారావు

భారతమాతకు మహా హారతి పడుతున్న కళాకారిణులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు