logo

లింకు పంపి.. ఖాతా లూటీ

మొబైల్‌కు వచ్చిన లింకును నొక్కడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా సైబర్‌ నేరగాళ్లు దోచేశారు. ఈ సంఘటన దోమ మండల పరిధిలోని కిష్టాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన

Published : 27 Jan 2022 01:06 IST

పరిగి గ్రామీణ: మొబైల్‌కు వచ్చిన లింకును నొక్కడంతో బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా సైబర్‌ నేరగాళ్లు దోచేశారు. ఈ సంఘటన దోమ మండల పరిధిలోని కిష్టాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... గ్రామానికి చెందిన నితిన్‌ తన సోదరి వివాహం కోసం రూ.1.02 లక్షల నగదు బ్యాంకులో దాచుకున్నాడు. కొన్ని వస్తువుల కొనుగోలు నిమిత్తం.. ఆన్‌లైన్‌ సేవలు పనిచేయడంలేదని అంతర్జాలం నుంచి కస్టమర్‌ కేర్‌ నంబరు సంపాదించి ఫోన్‌ చేశాడు. కొద్ది క్షణాల్లోనే అటు నుంచి లింకు రావడంతో దాన్ని నొక్కాడు. వెంటనే ఖాతాలో ఉన్న డబ్బంతా మాయమైంది. దీంతో ఆందోళన చెందిన ఆయన బుధవారం పరిగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పూర్తి సమాచారం సేకరించి సైబర్‌ క్రైంకు పంపనున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని