logo

ఇంటర్‌ కుర్రాళ్లు.. వరుస చోరీలు!

లంగర్‌హౌజ్‌.. గోల్కొండ.. జూబ్లీహిల్స్‌.. ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు యువకులు మొదటి రోజు జూబ్లీహిల్స్‌ మినహా రెండు పోలీసు ఠాణాల పరిధిలో చరవాణుల

Published : 27 Jan 2022 06:50 IST

బంజారాహిల్స్‌ పోలీసుల అదుపులో నిందితులు

సీసీ కెమెరాలో చిక్కిన నిందితులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: లంగర్‌హౌజ్‌.. గోల్కొండ.. జూబ్లీహిల్స్‌.. ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ముగ్గురు యువకులు మొదటి రోజు జూబ్లీహిల్స్‌ మినహా రెండు పోలీసు ఠాణాల పరిధిలో చరవాణుల స్నాచింగ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఒకచోట, బంజారాహిల్స్‌లో రెండు చోట్ల చరవాణులు లాక్కెళ్లారు. పక్కా పథకం ప్రకారం స్నాచింగ్‌లు పూర్తి చేశారు. అంతే వేగంగా.. వారి ఇళ్ల ముందు పోలీసులు వాలిపోయి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి ముగ్గురు యువకులు ఓ బైకుపై లంగర్‌హౌజ్‌, గోల్కొండ పోలీసు ఠాణాల పరిధిలో వరుసగా చరవాణులను లాక్కెళ్లారు. ఫిలింనగర్‌ వద్ద మరో చరవాణి లాక్కొనేందుకు ప్రయత్నించగా అది కిందపడిపోయింది. దీంతో పరారయ్యారు. మంగళవారం రాత్రి ఇలానే ఫిలింనగర్‌లో ఓ చరవాణిని వ్యక్తి చేతిలో నుంచి లాక్కొని పరారయ్యారు. తర్వాత బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఇన్‌కంటాక్స్‌ క్వార్టర్స్‌ వద్ద కాపలాదారుగా పనిచేసే వివేక్‌ మిశ్రా చరవాణిని లాకెళ్లారు. ఏసీబీ కార్యాలయం వైపు వెళ్లి లారీ డ్రైవర్‌ సైదులు చరవాణిని లాక్కొని పరారయ్యారు. బాధితులు ఆయా ఠాణాల పరిధిలో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.

సీసీ కెమెరా చిత్రాలు.. బైకు టైర్లు..

గోల్కొండ పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల అస్పష్ట చిత్రాలను గుర్తించారు. వాటిని అన్ని ఠాణాలకు పంపారు. వాటిని గమనించిన బంజారాహిల్స్‌ పోలీసులు ఆరా తీసి.. సింగాడికుంట ప్రాంతానికి చెందినవారిగా అనుమానించారు. బైకు టైర్లకు తెలుపు రంగు ఉండటంతో వారేనని నిర్ధారించుకున్నారు. మంగళవారం రాత్రి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకొన్నారు. ముగ్గురూ ఇంటర్‌ చదువుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు