logo

Crime News: ఖాతాలో వేయమని ఇస్తే.. రూ.90 లక్షలతో మాయం

సంస్థ ఖాతాలో డబ్బులు వేయమని ఇచ్చిన రూ.90లక్షలతో ఉద్యోగి ఉడాయించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి

Updated : 27 Jan 2022 06:43 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సంస్థ ఖాతాలో డబ్బులు వేయమని ఇచ్చిన రూ.90లక్షలతో ఉద్యోగి ఉడాయించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన ఎంజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు పంజాగుట్టలో ఓ శాఖ ఉంది. మూడు నెలలుగా ఈ సంస్థలో వినోద్‌కుమార్‌ అనే ఉద్యోగి అడ్మిన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నవంబరు 23న సంస్థ జనరల్‌ మేనేజర్‌ బి.శ్రీనివాసరావు అదే సంస్థలో పనిచేస్తున్న అసోసియేట్‌ మేనేజర్‌ టి.శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి రూ.90లక్షలు సంస్థ ఖాతాలో జమ చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆ డబ్బును వినోద్‌కుమార్‌కు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద అప్పగించాడు. డబ్బుతో వెళ్లిన వినోద్‌కుమార్‌ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు అతడిని చరవాణిలో సంప్రదించగా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి సంస్థకు విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి సంస్థ జనరల్‌ మేనేజర్‌ బి.శ్రీనివాసరావు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని