logo

అన్నపై కత్తితో దాడి చేసిన తమ్ముడు

స్నేహితుడి చరవాణి ఎందుకు అపహరించావని అన్నతో గొడవపడ్డ తమ్ముడు.. కోపంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో బుధవారం సాయంత్రం

Published : 27 Jan 2022 02:49 IST

కేశవగిరి, న్యూస్‌టుడే: స్నేహితుడి చరవాణి ఎందుకు అపహరించావని అన్నతో గొడవపడ్డ తమ్ముడు.. కోపంలో కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌వర్మ కథనం ప్రకారం.. బార్కస్‌ సమీపంలోని ముంతాజ్‌బాగ్‌ జమాల్‌బండకు చెందిన అన్నదమ్ములు సయ్యద్‌ జావీద్‌, సయ్యద్‌ ఆసిఫ్‌ చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని ఒమర్‌ గుల్షన్‌ ఫంక్షన్‌హాలులో కార్మికులు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ మూసా సయ్యద్‌ ఆసిఫ్‌కు స్నేహితుడు. అప్పుడప్పుడు ఆసిఫ్‌తో కలిసి ఫంక్షన్‌హాలులో పనికి వచ్చేవాడు. మూసా చరవాణి పోవడంతో ఆసిఫ్‌ తన అన్న జావీద్‌ను అనుమానించాడు. తిరిగిచ్చేయాలని వాగ్వాదానికి దిగాడు. దీంతో జావీద్‌ ఆసిఫ్‌పై చేయిచేసుకున్నాడు. కోపోద్రిక్తుడైన ఆసిఫ్‌ కత్తితో అన్నపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయమేమి లేదని, జావీద్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని